భగవద్గీత యువతర జీవనాదర్శం
అయిందేదో మంచికే అయింది.
అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది.
అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది.
నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్ ?
నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్ ?
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది.
నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడ నుండే పొందావు.
ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు
ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా.
నిన్న ఇంకొకరి సొంతం కదా
మరి రేపు మరొకరి సొంతం కాగలదు.
పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ.
భగవద్గీత యువతర జీవనాదర్శం
కావున జరిగేదేదో జరుగకమానదు -
అనవసరంగా ఆందోళన పడకు
ఆందోళన అనారోగ్యానికి మూలం.
ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు
ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు
కాలం విలువైనది - రేపు అనుదానికి రూపు లేదు.
మంచి పనులు వాయిదా వేయకు
అసూయను రూపుమాపు - అహంకారాన్ని అణగద్రొక్కు
హింసను విడనాడు - అహింసను పాటించు
కోపాన్ని దరిచేర్చకు - ఆవేశంతో ఆలోచించకు
ఉపకారం చేయలేకపోయినా - అపకారం తలపెట్టకు
భగవద్గీత యువతర జీవనాదర్శం
మతిని శుద్ధం చేసేది మతం - మానవత్వం లేని మతం మతం కాదు
దేవుని పూజించు - ప్రాణికోటికి సహకరించు, తద్వారా భగవదాశీర్వాదంతో
శాంతి నీవెంట ఇంట చెంత వుండగలదు.