23, మార్చి 2023, గురువారం

వెటకారం మరియు ప్రేమ కవితలు: The Perfect Combination of Emotion and Expression

వెటకారం మరియు ప్రేమ కవితలు: The Perfect Combination of Emotion and Expression

ఓ ప్రియా!  నువ్వు లేనిదే అంధకారం

నీవు ఉంటే మా జీవితం వెలుగుకారం.

మా ఇంట్లో నేను అంటే మమకారం 

మా  శత్రువులకు నేను అంటే తీర్చుకోవాలిసిన ప్రతీకారం 

నేను చేసేది మాత్రం ఉపకారం

నేను అంటే అందరికీ అభిమానం

నేను లేనిదే మా వీధి అంధకారం 

మా నాన్నకు నేనంటే అనురాగం

నేను లేనిదే తీరిక దొరకదు మా ఇంట్లో ప్రతి వారం 

నేనంటే అమ్మకు మమకారం 

నేను మాత్రం చురుకు మానం (నాకు కరగదు మనస్సులో ఉత్సాహం) 

మా అన్నయ్య అంటే నాకు అభిమానం 

ఆయనకు నాకు మీద లేదు మమకారం 

మా అక్క అంటే నాకు వీరాభిమానం 

అక్క మాత్రం నా మీద తీర్చుకోవాలనుకుంటుంది ప్రతీకారం 

శత్రువులు వస్తే జరుగుతుంది యుద్దరంగం

నేను లేనిదే గెలవడం అసాధ్యం 

సార్ అంటే నాకు ఆదర్శం 

ఆయన మాత్రం పెద్దవాళ్ళకు నిదర్శనం 

మేడమ్ అంటే నాకు మమకారం 

ఆమె మాత్రం నన్ను కొడుతూ తీర్చుకుంటుంది ప్రతీకారం 

దేశభక్తులు అంటే నాకు ఆదర్శం 

వారు లేనిదే మన జీవితం తెగిన గాలిపటం

పూలు అంటే అందరికీ ఇష్టం 

కానీ కొయ్యాలంటే నాకు చాలా కష్టం

కాయలు పండినప్పుడు తినాలి 

చదువు అయిపోయేదాకా చదవాలి. 

సముద్రంలో కెరటాలు ఎక్కువ అనగా సాధారణం 

మన జీవితంలో తప్పులు సర్వసాధారణం

బడి అంటే నాకు చాలా ఇష్టం 

మా మిత్రులకు బడికి రావడం చాలా కష్టం

అత్త-అల్లుడికి మధ్య వెటకారం 

నాకు-మా తమ్ముడికి మధ్య అనుబంధం 

నీరు లేనిదే చెట్లు ఎదగవు 

ఆదర్శం లేనిదే మనిషి ఒదగడు 

విత్తనం వేయగానే సరిపోదు మొక్క వచ్చేలా చూసుకోవాలి.

చదవగానే సరిపోదు చదివిన దానిని అర్థం చేసుకోవాలి. 

నీరు ఉంది త్రగడానికి 

ఆహారం ఉంది తినడానికి 

గాలి ఉంది పీల్చడానికి 

ఇవన్నీ తెలవని వాడు ఐతాడు అదో గతి.

 


Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...