12, ఏప్రిల్ 2023, బుధవారం

Manchi Telugu Kavithalu || మంచి తెలుగు కవితలు ||


             

చిన్నపిల్లలు కూడా ఇంత బాగా కవితలు రాస్తారా అని నాకు అనిపించింది. స్వప్న మరియు నాగలక్ష్మి అనే అమ్మాయిలు హై స్కూల్లో చదువుతున్నరు. ఈ అమ్మాయి కొన్ని కవితలు రాశారు. వాటిని నేను చదువుతుంటే ఈ అమ్మాయిలు చదువుతుంది 9వ తరగతి లాగా లేదు అనిపించింది. పురాతన గాథల గురించి కవిత రాశారు. మనీ గురించి కవిత రాసింది. మనీ అనేది మనల్ని ఏ విధంగా మారుస్తుందని విధానము గురించి రాశారు. చాలా అద్భుతంగా ఉన్నందున ఈ కవితలు అందరూ చదివితే బాగుండు అన్నట్టుగా నాకనిపించింది. స్వార్థం గురించి ఒక కవిత రాశారు. అది ఎంత బాగుందంటే అరే ఇంత చిన్న అమ్మాయి ఇంత బాగా కవితలు రాస్తారా? స్నేహం గురించి కవిత రాశారు. ఈ అమ్మాయిలు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తూన్నరు. 

మీకోసం ఆ కవితలు..........

"స్నేహం" గురించి కవిత

కిరణానికి చీకటి లేదు. 

సిరిమువ్వకి మౌనం లేదు.

చిరునవ్వుకి మరణం లేదు. 

మన 'స్నేహానికి' అర్థం లేదు. 

మరిచే 'స్నేహం' చేయకు.

చేసిన 'స్నేహం' మరవకు.


"స్వార్థం" గురించి కవిత

కురిసే వానకు 'స్వార్థం' లేదు.

పండే పంటకు 'స్వార్థం' లేదు. 

నింగికి నేలకి లేని 'స్వార్థం'.

మధ్య ఉన్న మనిషికి ఎందుకు నేస్తం

పుట్టినవాడు పట్టకపోడు 

మూడేళ్ల ముచ్చట కోసం 

మోసాలెందుకు ద్వేషాలెందుకు మిత్రమా!


"మనీ" గురించి కవిత

నోరు లేకుండానే పలికిస్తుంది.

కండ్లు లేకుండానే శాసిస్తుంది.

చేతులు లేకుండానే ఆడిస్తుంది.

కాలు లేకుండానే నడిపిస్తుంది.

లేని బంధాలను కలిపేస్తుంది.

ఉన్న బంధాలను తుడిచేస్తుంది.

ఇది మనసు లేని 'మనీ' 

మనిషి చేసిన 'మనీ' 

మనసును, మనిషిని ఆడిస్తున్న 'మనీ'.


కవిత 

సూర్యుడు లేని వెలుగు లేదు.

కృష్ణుడు లేని భారతం లేదు.

అర్జునుడు లేని కురుక్షేత్రం లేదు. 

మంచితనాన్ని మించిన మానవత్వం లేదు. 

నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. 

కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.


నితి గురించిన కవిత 

న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కాని

గెలిచేదంతా న్యాయం కాదు.

మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు.

చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు.

సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు 

ఏ రంగంలోనూ విజయం సాధించలేరు.

విజయానికి ఆత్మవిశ్వాసమే చాలా ముఖ్యం.

కను రెప్పల తడిని అర్థం చేసుకోగలిగే

సహృదయం ఉంటే కన్నీటి భాష తెలుస్తుంది........ 

మనకి మంచి చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం

మంచిని వినకపోవడం మన దురదృష్టకరం.......

వయసు పై పడటం మన చేతుల్లో లేదు

పైకి ఎదగడం మాత్రం మన చేతుల్లో పనే.

గొప్ప ప్రయత్నాలు గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయి.


నితి గురించిన కవిత 

మనం మనకోసం చేసేది మనలోనే అంతరించిపోతుంది.

ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది........

బలం వలన, ఐశ్వర్యం వలన, జ్ఞానం వలన కాదు గానీ విద్య వలన విజయం పొందావలెను.

ప్రపంచానికి వెలుగునిచ్చే భానుడు నిద్రిస్తున్నాడు.

నా ప్రాణానికి వెలుగునిచ్చే స్నేహమా ఎందుకు ఇంకా మేల్కొని వున్నావు.

నీ కనులు మూసి హాయిగా నిద్రపో........ చీకటి లేకుండా చుక్కలు మెరవవు

కష్టాలు లేకుండా జీవితం గెలవలేము

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...