ఆవు పులి నీతి కథ
ఆవు పులి
అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహరం కోసం అడవి అంతా కలయ
తిరుగుతుంది.
ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత వెయ్యడం చూసి ఇక తనకు మంచి ఆహరం దొరికిందని ఆ
ఆవును దగ్గర కి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది.
ఆవు పులి నీతి కథ
అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగ దూడకు ఎవరు పాలిస్తారు.
ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో భాదపడుతూ పులిని
చూసి అయ్యా నేను ఈ మద్యనే ఈనాను నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది.
అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది.
నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చిరావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి
మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాదేయ పడింది.
ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ది వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్నా నీమీద జాలితో నీకు
అవకాశం ఇస్తున్నాను. వెళ్ళి త్వరగా రా .. అని చెప్పింది.
ఆవు పులి నీతి కథ
తనకు అవకాశమిచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి
కడుపునిండా పాలిచ్చి మంచి బుద్దులు చెప్పి దాని బాధ్యతను తోటిపశువులకు అప్పగించి తిరిగి
అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది.
ఆవు నిజాయతీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చెయ్యకుండా తిరిగి
రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయుతీకి మెచ్చి నిన్ను
తినకుండా వదిలి పెడుతున్నాను.
వెళ్ళి నీ బిడ్డతో హాయుగా జీవించు అని దాన్ని విడిచి పెట్టింది.
పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయు తన బిడ్డతో హాయిగా
జీవించసాగింది.
నీతి - మన నిజాయుతీనే మనల్ని కాపాడుతుంది.