ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది
అనిరుధ్ చాలా మంచి అబ్బాయి.
ఇతరులు బాధపడడం చూసి భరించలేక పోయేవాడు.
ఒకరోజు అనిరుధ్ వాళ్ళ తాతయ్య బాధపడడం గమనించాడు.
అతను ఆయన దగ్గరకు వెళ్ళి ,
“ మీరు ఏమి ఆలోచిస్తున్నారు తాతయ్యా ? ”
మీరు పత్రిక కూడా చదవడం లేదే ” అని అడిగాడు.
“ నా కళ్ళద్దాలు కింద పడి విరిగిపోయినాయి.
అవి లేకుండా నేను ఏమీ చదవలేను”
అని తాతయ్య చెప్పారు .
" నేను ఉన్నానుగా తాతయ్యా ”
అంటూ లోపలికి వెళ్ళి ఒక బాక్సు తెచ్చాడు.
ఆ బాక్సు నుండి ఒక భూతద్దము తీసి తాతయ్యకు ఇస్తూ
ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది
“ దీనిలో నుండి చూస్తే మీకు అన్నీ చక్కగా కనిపిస్తాయి".
అక్షరాలు కూడా పెద్దవిగా,
స్పష్టముగా కనిపిస్తాయి .
దీనితో మీరు వార్తాపత్రిక చదువుకోగలరు.
ఈ లోగా నేను మీ కళ్ళద్దాలను సరి చేయించి తీసుకొని వస్తానని చెప్పాడు.
అదేవిధంగా, ఒకరోజు అత్తయ్య వంటగదిలో ఏదో వెతకడం గమనించి సహాయము చేయడానికి
అక్కడికి చేరుకున్నాడు .
“ నేను పాకెట్ నుండి సీసాలో నూనె వేయాలని వచ్చాను.
గరాటు ఎక్కడ ఉందో కనబడడం లేదు "
ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది
అని అత్తయ్య చెప్పగా అనిరుధ్ అక్కడ పడి ఉన్న ఖాళీ కూల్డ్రింక్ బాటిల్కు చాకుతో రంధ్రం చేసి
గరాటు లాగా చేసి అత్తయ్యకు ఇచ్చాడు.
ఒకరోజు అమ్మ బట్టలకు కుట్లు వేస్తున్నది. ఉన్నట్టుండి సూది జారి క్రింద పడిపోయింది.
ఎవరికైనా గుచ్చుకుంటుందేమోనని అమ్మ సూదిని వెతుకుతున్నది.
అంతలో అనిరుధ్+ అక్కడికి వచ్చాడు. అమ్మ సూది కింద పడిపోయిన విషయం చెప్పగా
“ నేనున్నానుగా ! ”
ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది
అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒక అయస్కాంతం తెచ్చాడు.
దానిని ఒక సన్నని కర్రకు కట్టి గదిలో వెతకగా సూది అయస్కాంతానికి అంటుకొంది.
అమ్మ చాలా సంతోషపడింది .
“ మా అనిరుధ్ చాలా తెలివైన వాడు ! ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తాడు ”
అంటూ అనిరుధ్ ను ముద్దాడింది .