నందుడు ఇంటి పై నందనవనం
నందుడు పట్టణానికి వచ్చి ఒక వారము రోజులు అయినప్పటికీ అతని మనస్సులో నిరాశ ఉండేది.
పల్లెలో కనిపించే
పచ్చటి పొలాలు,
పక్షులు,
చెరువులు - కుంటలు "కనిపించేవి కావు".
పై చదువులకు పట్టణాని కి వెళుతున్నానని చాలా సంతోషపడ్డాడు.
కానీ పట్నంలో "పల్లె పచ్చదనం" లేకపోవడం వలన అతని మనస్సు కూడా వాడిపోయినట్టు
అయినది.
ఈ విషయం అమ్మకు చెప్పగా,
అమ్మ “ డాబాపై కుండీలలో మొక్కలు పెంచుకోవచ్చని ”చెప్పింది".
మీ నాన్నతో కుండీలు తెప్పిస్తాను.
అంతేకాకుండా,
నీ స్నేహితుల సహాయముతో నీవు ఒక తోటను పెంచవచ్చు.
పక్షుల కొరకు గింజలు,
నీళ్ళు కూడా పెట్టవచ్చు "అని చెప్పింది.
నందుడు ఇంటి పై నందనవనం
నందుడు, అమ్మ చెప్పినట్లు
డాబా మీద తోటను పెంచసాగాడు.
ఒకరోజు ఒక పక్షి ఒక చిన్న కుండీలో నీరు త్రాగుతూ కనిపించింది.
అతను చాలా సంతోష పడి ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడు.
నందుడు సంతోషము చూసి తల్లి కూడా సంతోషపడింది.
ఒకసారి గింజలు వేయడానికి మిద్దెపైకి వెళ్ళగా చాలా పక్షులు కనిపించాయి.
అవి నందుడు కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్టు ఉన్నాయి.
రోజురోజుకూ నందుడు సంతోషముగా తోట పని చేస్తూ ఉన్నాడు.
నందుడు నాటిన మొక్కలు కూడా పెద్దవై పూతకు వచ్చాయి.
కొత్త చిగురులతో అవి చాలా అందముగా కనిపించాయి.
మల్లె మొక్క పూత పూయగా నలువైపులా దాని సువాసన వ్యాపించింది.
వాటిపై వాలడానికి తూనీగలు,
నందుడు ఇంటి పై నందనవనం
సీతాకోకచిలుకలు కూడా వస్తున్నాయి.
ఇవన్నీ చూసి నందుడు చాలా సంతోషపడ్డాడు.
ఇలాంటి పచ్చని మొక్కలను పెంచాలి, అందుకు తన వంతు సహాయం చేయాలని”
అనుకున్నాడు.