12, మార్చి 2023, ఆదివారం

గద్ద నమ్మకం

 గద్ద నమ్మకం




పశువులను మేపుతున్న ఒక పాపకి చెట్టుపైనున్న గూటిలొ ఒక గ్రద్ద గుడ్డును తన ఇంటిలో పొదిగే కోడి గుడ్లలో ఉంచాడు.


ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది గద్ద పిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడి పిల్లలతో పాటు తిరుగసాగింది.


ఆ గద్దపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో కోడిపిల్ల లాగానే వ్యవహరిస్తూ జీవించింది.


అందుకే ఆ గద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది, గద్దపిల్ల ధృఢంగా పెరిగి పెద్దదైన తరువాత తను కోడిపిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది.


తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది.





ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది.


అలా ఎగురుతూ పైపైకి పోయింది, పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది.


తన విధి కంచె లోపల తిరిగే కోడిపిల్లగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది, తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది, ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టుపైన నివసించే ధైర్యానికి, స్వతంత్రాని పోందగలిగింది. 


వినీల ఆకాశంలొ చాలా ఎత్తుకు ఎదగ గలిగింది.

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...