భిన్నత్వంలో ఏకత్వం
బాల కవితా ప్రకాశం అనేటట్టు వంటి ఒక బుక్ లో భిన్నత్వంలో ఏకత్వం గురించి ఒక విద్యార్థి కవిత రాశాడు
ఈ కవిత చదవండి ఎంత బాగుంటుందో
ఒకే కంఠం
ఒకే నినాదం
ఒకే ఆశయం మనమంతా
ఒకే జాతి , ఒకే నీతి
ఒకే పతాకం మనకంతా
భాషా వేషం ఏదైనా
భారతీయులం మనమంతా
ఊరు , పేరు వేరైనా
ఒకే కుటుంబం మనమంతా
ఒకే మాట మనదంతా
ఒకే పాట మనదంతా
ఒకే బాట మనదంతా
ఒకే కోట మనదంతా
జై హిందే మన మాట
జనగణమణ మన పాట
ఈ కవిత లో భిన్నత్వంలో ఏకత్వం గురించి వివరించుట జరిగింది.