23, మార్చి 2023, గురువారం

అమ్మ గురించి నిజమైన భావాలు ప్రతిఫలించే కవితలు



అమ్మ గురించి నిజమైన భావాలు ప్రతిఫలించే కవితలు 


అమ్మంటే ప్రేమ 

అమ్మ మనసు ఎంతో అందం 

అమ్మ మాట ఎంతో గంధం 

ఆ మాటలో నే ఉంది చందం 

అమ్మంటే అందం

అమ్మంటే అందం

నవమాసాలు మోసి, మనం మెన్ని తప్పులు చేసినా

తన కడుపులో దాచుకొని 

బిడ్డల కోసం పగలనక, రాత్రనక

కన్నబిడ్డల కడుపు తీపి కోసం

తను పస్తులు౦డి, కన్నబిడ్డల 

కడుపులు నింపటం కోసం

ఎంతో శ్రమించే, పరిశ్రమించే 

మమతలు పంచే తల్లికి 

నిలువెత్తు ప్రేమమూర్తికి కరీదు లేదోయ్ 

అమ్మ ప్రేమకు వెలకట్టలేమోయ్ 

ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ ఋణం తీర్చుకోలేమోయ్.   


Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...