ఉపాధ్యాయుల గురించి కవితలు: విద్యార్థుల మనసులో నేపథ్యం
గురువును నమస్కరించు
గురువును పూజించు
గురువును ఆరాధించు
అప్పుడు గురువు సంతోషించు
విద్యార్ది గాలిపటంమైతే
దారం గురువు
ఆధారం గురువు
ఆ గురువే దైవం
గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకించు
గురువు పలికే మాటలను పాటించు
గురువుకు మంచి పేరు తెప్పించు
గురువే జ్యోతి
తను వెలుగుతు మనల్ని వెలిగిస్తాడు
చదువు చెప్పే గురువులను మరువకు
గురుపూజోత్సవం విడువకు
గురువు చెప్పే మాట జవ దాటకు
గురువే మనకు ఆదర్శం
అందుకే మన గురువులకు వందనం
జ్ఞానదాతలకు పాదాభి వందనం