ప్రకృతి పై తెలుగు ప్రభావిత కవితలు
నల్ల మబ్బులు క్రమ్ము కొనగా !
తెల్ల చినుకై కుమ్మరించగా !
పుడమి తల్లీ పులకరించగా !
నేల తల్లీ నెలలు తప్పగా !
వచ్చి చేరెను వానచినుకు !
నిండ తడిపెను నీరు పొర్లగా !
వాగు వంకలు పొంగి పొర్లగా !
చెరువు దొరువులు నిండి మునగగా !
వెండి పరదా పరచినట్లు !
ఎటు చూచిన నిండు తనమే !
అన్ని చెట్లుకు ప్రాణమొచ్చెను !
అమ్మతనమును అలముకొనేను !
కమ్మనైనా ఫలములిచ్చి జేజేలు గొట్టగ జనముకిచ్చి !!