అమ్మ గొప్పతనం పై కవితలు
తెలుగులో: పరిశీలనాత్మక విశ్లేషణ
అమ్మ అంటే నాకిష్టం
అమ్మ మాట అమృతం
మంచి మనసు అమ్మ
మాటలు నేర్పింది అమ్మ
అన్నం పెట్టింది అమ్మ
ఆకలి తీర్చింది అమ్మ
మంచి బాట నేర్పింది అమ్మ
మాట నేర్పింది అమ్మ
అమ్మ మాట వేదం
అమ్మ మాట సత్యం
గోరుముద్దలు తినిపించింది అమ్మ
గోగుపూలు చూపింది అమ్మ
నడక నేర్పింది అమ్మ
నాట్యం నేర్పింది అమ్మ
డబ్బులు ఇచ్చింది అమ్మ
కోరికలు తీర్చింది అమ్మ
బడి బాట పట్టించింది అమ్మ
బంగారు జీవితం ఇచ్చింది అమ్మ
అమ్మ ! అమ్మ ! నువ్వు లేకుంటే
ఈ జీవితం వృధా అమ్మ !