రైతు కథ
ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పని చేసి
అలసిపోయి,
ఇంటికి వచ్చి,
నడుము వాల్చి,
"ఓ దేవుడా! నా కొక చిన్న నిధి ఇవ్వలేవా?”
అని ప్రార్థన చేశాడు.
అకస్మాత్తుగా అతని ముందొక నంచి పడింది.
మరుక్షణమే అతనికి ఇలా వినపడింది.
"ఈ సంచీలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది.
దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకు తుంది.
తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణాలైనా దొరుకుతాయి.
నీకు చాలినన్ని తీసుకున్నాక, ఈ సంచీని నదిలో పారెయ్యి.
అయితే ఒక్కటి గుర్తుంచుకో సంచీని నదిలో పారేసేదాకా నువ్వా డబ్బును ఖర్చు చెయ్యరాదు.
అలా ఖర్చు చేశావో,
నువు తీసిన డబ్బు
యావత్తూ మాయమవుతుంది.
"కూతురికి అక్కడ ఏం జరుగుతుందో విన్నది." తండ్రికి విషయం తెలియదు.
"రైతు పరమానందం చెంది,
ఆ రాత్రల్లో సంచీలో నుంచి బంగారు నాణాలు తీసి,
రైతు కథ
ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు.
సంచీని నదిలో పారేసిన దాకా బంగారాన్ని వాడటానికి లేదు.
ఇంకొక్క రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతం నింపి,
తరవాత సంచిని నదిలో పారేద్దామనుకున్నాడు.
ఇలా చాలా రోజులు గడిచాయి.
గోతాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి.
రైతు రోజూ బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు.
చివరకు ఒకనాడు అతను చనిపోయాడు.
ఇరుగు పొరుగువాళ్ళు వచ్చి చూసి,
ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కొద్దీ బంగారు నాణాలుండటం చూసి నిర్ఘాంతపోయారు.